Sonia కాళ్లు మొక్కి.. తర్వాత రోజే కేసీఆర్ మాట మార్చాడు: ఖర్గే
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ఇవ్వాలని సోనియా గాంధీ కాళ్లు మొక్కారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఆ తర్వాత వెంటనే మాట మార్చారని పేర్కొన్నారు.
Kharge: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. వరస బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా రోడ్ షోలు, బహిరంగ సభల్లో ప్రజల ముందుకు వస్తోన్నారు. సంగారెడ్డిలో జరుగుతోన్న కార్నర్ మీటింగ్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Kharge) పాల్గొన్నారు.
సంగారెడ్డిలో ఇందిరా గాంధీ అడుగుపెట్టి దేశమంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించారని గుర్తుచేశారు. ఇందిరా హయాంలోనే బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు వచ్చాయని తెలిపారు. ఇక్కడి నుంచి ఆమె గెలవకపోయి ఉంటే సంస్థలు ఏర్పాటయ్యేవా అని అడిగారు.
పేదల కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోందని ఖర్గే (Kharge) వివరించారు. బ్యాంకులకు జాతీయం చేసింది.. రైత కూలీల కోసం ఉపాధి హామీ పథకం తీసుకొచ్చామని పేర్కొన్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఇవ్వాలని సోనియా ఇంటికెళ్లి, ఆమె కాళ్లను కేసీఆర్ మొక్కాడని ఖర్గు గుర్తుచేశారు. ఆ తర్వాత రోజే మాట మార్చాడని తెలిపారు.
మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చాడని ఖర్గే విరుచుకుపడ్డారు. సంస్థలను అమ్మేస్తోందని.. భూములను విక్రయిస్తోందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. మహాలక్ష్మీ పథకం ప్రతి నెల ప్రతి నెల మహిళలకు రూ.2500 ఇస్తామని, రైతులకు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు.