CM Revanth: మాట ఇచ్చినట్టే రేవంత్ రెడ్డి (CM Revanth) ముఖ్యమంత్రి కాగానే ప్రజాదర్బార్ నిర్వహించారు. జ్యోతిబాపూలే ప్రజా భవన్లో ఈ రోజు నుంచి ప్రజా దర్బార్ ప్రారంభమైంది. సీఎం రేవంత్‌ను కలిసేందుకు జనం క్యూ కట్టారు. ఒక్కొక్కరు తమ సమస్యలను విన్నవించారు. సంబంధిత విభాగాలను ఇష్యూను సీఎం రేవంత్ (Revanth) బదిలీ చేశారు. హెల్ప్ డెస్క్ ఉంది. అక్కడ జనం ఫిర్యాదు నమోదు చేసి.. క్యూ లైన్లలో లోపలికి పంపిస్తున్నారు.
బయటకు వచ్చిన జనంతో మీడియా ప్రతినిధులు మాట్లాడారు. తన పరిస్థితి బాగోలేదని.. అటెండర్ పోస్ట్ ఇప్పించాలని ఓ మహిళా కోరారు. రైళ్లలో అడుక్కునే దానినని వివరించారు. తమ సమస్యను సీఎంకు వివరించానని.. సాయం చేస్తానని మాట ఇచ్చారని చెబుతున్నారు. మరో మహిళ కూడా తన బాధను వెల్లబోసుకున్నానని చెప్పారు. 10 నెలల క్రితం భర్తను పోలీసులు లాకప్ డెత్ చేశారని తెలిపారు. ఆకారణంగా హత్య చేశారని.. తర్వాత తనకు ఏ న్యాయం చేయలేదని అంటున్నారు. తనకు ఇద్దరు అమ్మాయిలు, ఓ బాబు ఉన్నారని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్‌ను కలిసే ప్రయత్నం చేస్తే తమను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు రేవంత్‌తో మాట్లాడానని చెప్పారు. తమ ప్రభుత్వం వస్తే న్యాయం చేస్తామని మాట ఇచ్చారని వివరించారు. ఇప్పుడు తనకు ఆనందంగా ఉందని.. సార్ న్యాయం చేస్తానని చెప్పారని తెలిపారు.
Telangana CM Revanth Reddy interacts with people and listens to their grievances to resolve them, at the 'Praja Darbar' / 'Janta Darbar' conducted at Jyotirao Phule Praja Bhavan in Hyderabad. pic.twitter.com/qGvmpwm3X7
ఏదో ఒక సమస్యపై చాలామంది వచ్చారు. ఇల్లు లేదని చెప్పగా.. డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని మాట ఇచ్చారు. ఇదివరకు తమను రానీయలేదని.. ఇప్పుడు లోపలికి వచ్చి, సీఎంను కలిసే వీలు ఉందన్నారు. సీఎంను కలువడంతో తమలో కొత్త ఉత్సాహం వచ్చిందని పేర్కొన్నారు. అందరితో రేవంత్ ఆప్యాయంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అక్కడే డేటా ఎంట్రీ డెస్క్ కూడా ఉంది. ఎంత మంది వచ్చారు.. సమస్య ఏంటీ, పరిష్కారం అయ్యిందా అనే వివరాలు నమోదు చేస్తున్నారు.