3 అంశాలపై విచారణకు ఆదేశించామని అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. తప్పులపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యీ జగదీశ్ రెడ్డి కోరడంతో.. ఈ మేరకు 3 అంశాలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశించారు.
3 Matters Inquire: తెలంగాణ అసెంబ్లీ హాట్ హాట్‌గా కొనసాగుతోంది. సీఎం రేవంత్ (Revanth), మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల (BRS Mla) మధ్య డైలాగ్ వార్ జోరుగా జరుగుతోంది. సభలో ఈ రోజు తప్పులపై జ్యుడిషీయల్ ఎంక్వైరీ వేయాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సవాల్ చేశారు. దానిని సీఎం రేవంత్ స్వాగతించారు. గౌరవ సభ్యుడు డిమాండ్ చేసినందున.. విచారణ జరిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటన చేశారు.
ఏ ఒక్క అంశంపై కాకుండా 3 అంశాలపై విచారణ జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. విద్యుత్ రంగంల జరిగిక అవకతవకలపై ప్రజలకు తెలియాలని శ్వేతపత్రం విడుదల చేశామని సీఎం రేవంత్ తెలిపారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని అంటున్నారు. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంతో విద్యుత్ కొనగోళ్లపై విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపారు. తక్కువ ధరకు కేంద్రం విద్యుత్ ఇస్తోన్న.. అధిక ధరకు ఛత్తీస్ గఢ్ నుంచి కొనుగోలు కోసం ఒప్పందం చేసుకున్నారని తెలిపారు.
1080 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్‌పై విచారణకు ఆదేశిస్తున్నానని సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. కరెంట్ అనే సెంటిమెంట్‌ను గత ప్రభుత్వం ఆర్థిక అవసరాలకు వాడుకుందని రేవంత్ ఆరోపించారు. ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై ఆరోజు ప్రశ్నించిన తమను అసెంబ్లీ నుంచి మార్షల్స్ చేత బయటకు పంపించారని గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో పనిచేసిన విద్యుత్ నిపుణులను మారుమూల ప్రాంతాలకు బదిలీ చేశారని చెప్పారు. 24 గంటల విద్యుత్ ఇచ్చామని అబద్ధాలు చెబుతున్నారని మరోసారి విమర్శించారు.