kcr kondagattu old photo:పాతికేళ్ల కింద కొండగట్టుపై సీఎం కేసీఆర్
పాతికేళ్ల తర్వాత కేసీఆర్ కొండగట్టుకు వచ్చారు. 1998లో కొండగట్టుకు రాగా.. ఈ రోజు మళ్లీ వచ్చారు. సీఎం (cm) హోదాలో తొలిసారి ఇక్కడకు వచ్చారు. ఆ సందర్భాన్ని పురష్కరించుకుని ఎంపీ జోగినిపల్లి సంతోష్ (santosh) పాత ఫోటోను షేర్ చేశారు.
kcr kondagattu old photo:తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) కొండగట్టు ఆంజన్న క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయ అభివృద్దికి మరో రూ.500 కోట్లను (500 crores) కేటాయిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రూ.100 కోట్లను (100 crores) కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం కోసం నిన్న (మంగళవారం) కేసీఆర్ కొండగట్టు రావాల్సి ఉంది. భక్తుల రద్దీ దృష్ట్యా అది బుధవారానికి వాయిదా పడింది. ఈ రోజు ఆయన ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అక్కడే ఉన్న భేతాళస్వామి ఆలయం (betala swamy temple) , సీతమ్మ కన్నీటిధార (seethamma kannitidhara), కొత్త పుష్కరిణి (kotha pushkarini), కొండలరాయుడి గుట్టలను (kondalarayudi gutta) పరిశీలించారు. కొండగట్టు అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ను అధికారులతో కలిసి సమీక్షించారు. ప్రపంచాన్నే ఆకర్షించేలా అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా కొండగట్టును తీర్చిదిద్దాలని అన్నారు. యాదాద్రి తరహాలో కొండగట్టు అంజన్న ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నాచుపల్లి జేఎన్టీయూ కాలేజీ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టు చేరుకున్నారు. సీఎం కేసీఆర్కు ఆలయ వర్గాలు పూర్ణకుంభ స్వాగతం పలికాయి.
పాతికేళ్ల తర్వాత
పాతికేళ్ల తర్వాత కేసీఆర్ కొండగట్టుకు వచ్చారు. 1998లో కొండగట్టుకు రాగా.. ఈ రోజు మళ్లీ వచ్చారు. సీఎం (cm) హోదాలో తొలిసారి ఇక్కడకు వచ్చారు. ఆ సందర్భాన్ని పురష్కరించుకుని ఎంపీ జోగినిపల్లి సంతోష్ (santosh) పాత ఫోటోను షేర్ చేశారు. అందులో సీఎం సతీమణీ శోభ (shoba). కూతురు కవిత (kavitha), కుమారుడు కేటీఆర్ (ktr) ఉన్నారు. కేసీఆర్ వెనకాల కేటీఆర్ ఉండటంతో ఆయనేనా కాదా అనే అనుమానం కలుగుతుంది. మరో ఇద్దరు కూడా ఫోటోలో ఉన్నారు. సంతోష్ ఈ ఫోటోను షేర్ చేయగా.. వైరల్ అవుతుంది. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు సంతోష్, కవితకు ట్యాగ్ చేస్తున్నారు.
దివ్యంగా హనుమాన్ దీక్ష
కొండగట్టు ఆంజనేయ స్వామి (anjaneya swamy) ఆలయం అభివృద్ధి ఒక బృహత్తర ప్రాజెక్టని, భక్తులకు సకల వసతులు, అన్ని హంగులతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం (cm) చెప్పారు. కొండగట్టులో ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఘాట్ రోడ్డులను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. హనుమాన్ జయంతిని దేశంలో అత్యంత గొప్పగా కొండగట్టులో జరుపుకోవాలన్నారు. వేల మంది ఒకేసారి హనుమాన్ దీక్ష ధారణ, విరమణ చేస్తుంటారని, అలాంటి సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. హనుమాన్ దీక్ష దివ్యంగా జరిగేలా కృషిచేయాలని సూచించారు.
850 ఎకరాల్లో అభివృద్ది
850 ఎకరాల్లో (acres) ఆలయ అభివృద్ధి , విస్తరణ పనులు చేయాలని, పెద్ద గోడ, పార్కింగ్, పుష్కరిణి, అన్నదాన సత్రం, కళ్యాణ కట్ట, కోనేరును అభివృద్ధిపర్చాలని స్పష్టంచేశారు. ఆలయం పరిసరాల్లో 86 ఎకరాల స్థలంలో సువిశాల పార్కింగ్ (parking) ఏర్పాటు చేయాలని సూచించారు. వసతులు గొప్పగా ఉంటే దర్శనానికి వచ్చే భక్తులు పెరుగుతారని చెప్పారు. తాను మళ్ళీ కొండగట్టుకు వస్తానని, ఆలయ అభివృద్ధి, విస్తరణపై సమీక్ష నిర్వహిస్తానని అన్నారు. సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటనలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి (indrakaran reddy), గంగుల కమలాకర్ (gangula kamalakar), కొప్పుల ఈశ్వర్ (koppula eshwar) తదితరులు పాల్గొన్నారు.