Chikoti Praveen:థాయ్‌లాండ్ పోలీసులు ఈ రోజు గ్యాంబ్లర్లను అరెస్ట్ చేశారు. బ్యాంగ్ లాముంగ్ జిల్లా టాంబోన్ నాంగ్ ప్రూలో గల సోయి ఫ్రూ తమ్నాక్ 4లో ఆసియా పట్టాయా హోటల్‌పై దాడి చేశారు. డిటెక్టివ్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రైడ్ చేశారు. 14 మంది మహిళలు సహా మొత్తం 90 మంది అరెస్ట్ అయ్యారు. చికోటి ప్రవీణ్ కుమార్ (Chikoti Praveen), మెదక్ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి (Devender reddy) కూడా ఉన్నారు. థాయ్‌లాండ్‌కు చెందిన మహిళలతో కలిసి చికోటి ప్రవీణ్ గ్యాంబ్లింగ్ డెన్ ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర చోట్ల నుంచి కూడా గ్యాంబ్లింగ్ కోసం జనాలను తీసుకొచ్చారట. శనివారం రోజు పటాయి తీసుకొచ్చారని తెలిసింది. సోమవారం ఉదయం ఇండియా రావాల్సి ఉంది. అర్ధరాత్రి పోలీసులు రైడ్ చేయడంతో అంతా దొరికిపోయారు. థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్‌ను తీవ్ర నేరంగా పరిగణిస్తారు.
పటాయాలో విలాసవంత హోటల్లో తెల్లవారుజామున రైడ్ చేశారు. ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేదీ వరకు భారతీయులు గదులు బుక్ చేసుకున్నారని తెలిసింది. జూదం కోసం సంపావో అనే సమావేశ గదిని అద్దెకు తీసుకున్నారట. భారీగా నగదు, గేమింగ్ చిప్స్ స్వాధీనం చేసుకున్నారు. 20.92 కోట్ల గేమింగ్ చిప్స్, 1.60 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు.
చికోటి ప్రవీణ్ కుమార్‌పై (Chikoti Praveen) మనీ ల్యాండరింగ్ కేసు ఉన్న సంగతి తెలిసిందే. ప్రముఖులతో పరిచయాలు, పార్టీలు, గ్యాంబ్లింగ్ ఏర్పాటు చేయడంపై గతంలో ఈడీ అధికారులు ఆరా తీశారు.