»Chennur Mla Balka Suman Sensational Comments About Congress Party Leaders
BalkaSuman: ఆ పార్టీలో ఉన్నది మనోళ్లే.. ఏం అనొద్దు
తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. పలు ప్రాంతాల్లో ఇప్పటికే అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలో తాజాగా చెన్నూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమన్(balka suman) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Chennur MLA balka suman sensational comments About congress party leaders
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్(BRS) పార్టీ తమ 115 అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌తో పాటు కామారెడ్డి సెగ్మెంట్లో కూడా పోటీ చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రకటించిన అభ్యర్థులు తమ పార్టీ తరఫున ప్రచారం చేయడం ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో తాజాగా చెన్నూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమన్(balka suman) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ(congress party)లో ఉన్న అభ్యర్థులను ఏమి అనొద్దని కార్యకర్తలు, ప్రజలకు సూచించారు. వాళ్లు కూడా మనోళ్లేనని అన్నారు. నిజం చెప్పాలంటే మనమే కొందరిని ఆ పార్టీలోకి పంపామని వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వారు గెల్చిన తర్వాత మళ్లీ మన పార్టీలోకే వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ వారి విషయంలో ఎవరూ కూడా అనవసర వ్యాఖ్యలు చేయకూడదని కోరారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో 30 మంది ఎమ్మెల్యేలకు కేసీఆర్(KCR) డబ్బులు పెట్టి గెలిపించుకోవాలని చూస్తున్నారని బీజేపీ నేత బండి సంజయ్(bandi sanjay) అన్నారు. వారు గెలిచిన తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళతారని వ్యాఖ్యానించారు. ఇలాంటి క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతలను నమ్మవద్దని కోరారు.