NGKL: కొల్లాపూర్ మండలం ఎన్మనబెట్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంత్రి జూపల్లి కృష్ణారావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులు ఆడంబరాలకు పోయి అప్పులు చేయవద్దని, ఉన్నంతలో చక్కని ఇల్లు నిర్మించుకుని కుటుంబ భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.