SRPT: నడిగూడెం మండల కేంద్రానికి చెందిన ఎన్ఎస్పీ విశ్రాంత ఉద్యోగి కొరట్ల తిరుపతయ్య సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. సామాన్యుడిగా పేరున్న తిరుపతయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అల్లుకున్నాయి. ఆయన మృతి పట్ల విశ్రాంత ఉద్యోగుల సంఘం నలుగురం మండల అధ్యక్షుడు ఖలీల్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.