HYD: రెవెన్యూ రికార్డుల ప్రకారం మహానగరంలో ఉన్న 800 చెరువుల్లో చాలావరకు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. పారిశ్రామిక, గృహ వ్యర్థాలు చేరడంతో నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిమాణం ఆందోళనకరంగా పడిపోతోంది. పీసీబీ నివేదిక ప్రకారం సుమారు 40 చెరువుల్లో డీవో స్థాయి 0.3-2.8 మధ్య నమోదైంది. సహజ, యాంత్రిక పద్ధతుల్లో ఆక్సిజన్ పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.