KMM: రఘునాథపాలెం (M) పాపటపల్లి గ్రామంలో కోతుల బెడదకు వినూత్న పరిష్కారాన్ని రైతులు కనుగొన్నారు. నిత్యం పంటలను పాడుచేస్తున్న కోతుల దెబ్బకు విసుగు చెందిన రైతు పోతనబోయిన జగ్గయ్య చింపాంజీ వేషధారణ ధరించి పొలాల్లో తిరగడం మొదలు పెట్టాడు. ఈ వేషాన్ని చూసి కోతులు భయపడి పారిపోతున్నాయి. ఈ ఉపాయంతో కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని గ్రామస్థులు తెలిపారు.