ఖమ్మం జిల్లా కోర్టు సీనియర్ న్యాయవాది జాహిర్ అలీపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు ఐఎల్పీఏ (ILPA) జిల్లా కన్వీనర్ జనపరెడ్డి గోపికృష్ణ తెలిపారు. కొంతమంది దుండగులు జాహిర్ అలీపై భౌతిక దాడికి పాల్పడి హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.