HYD: సెక్రటేరియట్లో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మీటింగ్ జరిపారు. మెదక్ కొండాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ రూ.1,000 కోట్ల పెట్టుబడులతో అభివృద్ధి చేసిన పరిశ్రమల నిర్మాణాలు పూర్తయ్యాయని, మొత్తం 64 యూనిట్లలో 36 యూనిట్లు త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. వీటితో సుమారు 5,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.