MBNR: బాలానగర్ మండల సర్పంచుల సంఘం ఎన్నికలు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగాయి. పోచమ్మగడ్డ సర్పంచ్ జె.కుమార్ నాయక్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సునీత, చెన్నమ్మ, శ్రీను, కోశాధికారులుగా జంగమ్మ, వసంత, అరుణ, రాజు, వెంకటేష్ నాయక్ ఎన్నుకోబడ్డారు. నూతన కమిటీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.