MHBD: డోర్నకల్ మండలం తోడేళ్లగూడెంలో పిచ్చికుక్క దాడితో ఏడుగురు గాయపడ్డారు. వృద్ధులు గురవమ్మ, వెంకన్న సహా పలువురిపై వీధి కుక్క దాడి చేసింది. బాధితులను చికిత్స కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో జబ్బుపడిన కుక్కలు సంచరిస్తున్నా, పశు వైద్యులు, అధికారులు పట్టించుకోవడం లేదని, తక్షణమే టీకాలు, నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.