MHBD: రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 2న ప్రకటించిన గ్రామ పంచాయతీ తుది ఓటరు జాబితాలో ఏవైనా తప్పులు, సవరణలు ఉంటే సంబంధిత గ్రామ పంచాయతీల్లో దరఖాస్తు చేసుకోవచ్చని మరిపెడ MPDO వేణుగోపాల్ ఇవాళ తెలిపారు. వార్డు స్థాయి, గ్రామ పంచాయతీ స్థాయిలో పేర్లు జత, తొలగింపు, సవరణలకు అవకాశం కల్పించారు. ఓటర్లు స్థానిక పంచాయతీ కార్యాలయంలోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు.