WGL: నిర్దిష్ట గడువులోగా ఎఫ్ఎస్టిపి పనులు పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. వరంగల్ నగర పరిధికి సంబంధించి స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా కొనసాగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.