BHPL: మలహర్రావు మండలం కొయ్యూరు గ్రామంలోని ఆదివాసీ కాలనీని సోమవారం సీపీఐ(ఎంఎల్) భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మల్లేష్, యూవైఎఫ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాబు యాదవ్ సందర్శించారు. మల్లేష్ మాట్లాడుతూ.. నిరుపేద ఆదివాసులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వెంటనే సర్వే చేసి ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.