నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ప్రైవేటు డీలర్ల వద్ద యూరియాను రైతులకు పంచాలని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు డీలర్లు యూరియాను సరఫరా చేయకుండా దాచి ఉంచి అక్రమ కొడతా సృష్టిస్తున్నారని అన్నారు. రైతులకు వచ్చిన యూరియా శాస్త్రీయంగా వాడాలన్నారు.