HYD: నగరంలో జరుగుతున్న గణేష్ నిమజ్జనంలో హైడ్రా కీలక సేవలు అందిస్తుంది. నగరంలోని చెరువుల వద్ద 51 డీఆర్ఎఫ్ బృందాలు, 745 మంది సిబ్బంది విధులు నిర్వహించారు. 121 మంది గజ ఈతగాళ్లు బోట్లలో చెరువుల వద్ద గస్తీ నిర్వహించారు. హుస్సేన్ సాగర్లో హైడ్రా అధికారులు పర్యవేక్షణ చేస్తూ శాంతియుతంగా సాగేందుకు కృషి చేశారు.