KNR: ప్రపంచ రికార్డు కోసం ఆధ్యాత్మిక భజన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చొప్పదండిలోని భజన కళాకారుల బృందం నాయకురాలు దండే రమాదేవి తెలిపారు. కరీంనగర్ కళాభారతిలో బుధవారం 10 గంటల పాటు ప్రదర్శన కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల నుంచి వెయ్యి మంది కళాకారులు హాజరవుతున్నారని, ప్రాచీన కళారూపమైన ఆధ్యాత్మికత తేవడానికి ఈ ప్రదర్శన చేస్తున్నామని పేర్కొన్నారు.