NGKL: గుంటనక్క (గోల్డెన్ జాక్) దాడిలో రెండుగేదెలు మృతిచెందిన సంఘటన తిమ్మాజీపేట మండలం చేగుంటకు చెందిన రైతు వినోద్ పొలంలో నిన్నరాత్రి జరిగింది. ఇవాళ ఘటన స్థలాన్ని పరిశీలించిన ఫారెస్ట్ రేంజ్ అధికారి దేవరాజు మాట్లాడుతూ.. రాత్రివేళల్లో పశువులను పొలాల దగ్గర కాకుండా ఇంటిదగ్గర కట్టివేయాలని సూచించారు. కాగా రెండు గేదెలు మృతిచెందడంతో రైతు బోరున విలపించారు.