SKLM: ఆమదాలవలస మండలంలోని కాట్యా చర్యులపేట గ్రామంలో నిర్మించిన శివాలయం రేపు (మంగళవారము) ఘనంగా ప్రతిష్ట మహోత్సవాలు జరగనున్నట్లు గ్రామ సర్పంచ్ ఎన్ని రామచంద్రరావు సోమవారం తెలిపారు. రేపటి నుండి మూడు రోజుల పాటు ఆలయ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నామని, అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆయన కోరారు.