AP: కేశినేని నాని ఆరోపణలకు చిన్ని కౌంటర్ ఇచ్చారు. ‘నాని చేసే పసలేని ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదు. జగన్కు గూఢచారిగా పనిచేసిన వ్యక్తి నాని. అమెరికా, దుబాయ్ కంపెనీలంటూ ఆరోపిస్తున్నారు. ఫేక్ కంపెనీలను నిరూపించాల్సిన బాధ్యత నానిదే. నాకు, కేసిరెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీలు నిరూపించాలి’ అని అన్నారు. కాగా.. కేసిరెడ్డి కంపెనీల్లో చిన్నికి వాటా ఉందని నాని ఆరోపించారు.