SKLM: విశాఖపట్నంలో ఇటీవల తెలుగు వెలుగు సాహితి వేదిక ఆధ్వర్యంలో భారత కీర్తి కిరీట పురస్కారం అందుకున్న శ్రీకాకుళం వాణిజ్య పనుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ జి రాణి మోహన్‌ను ఘనంగా సత్కరించారు. సోమవారం శ్రీకాకుళం స్థానిక శాఖ కార్యాలయంలో జీఎస్టీ అకౌంటెంట్స్‌తో పాటు ప్రాక్టీషనర్స్ ఘనంగా సన్మానించారు. ఈ క్రమంలో స్థానిక సిబ్బంది కూడా ఆమెకు అభినందనలు అందజేశారు.