ATP: శెట్టూరు మండలంలో ఈ నెల 5 నుంచి 15వ తేదీ వరకు ఆధార్ శిబిరాలు నిర్వహించనున్నట్లు ఇన్చార్జ్ ఎంపీడీవో రఘురామరావు తెలిపారు. మండలంలోని ఐదుకల్లు, యాటకల్లు, చిన్నంపల్లి, బచ్చేహళ్లి, చింతర్లపల్లి గ్రామాల్లో శిబిరాలు రోజువారీగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.