WGL: మంటల్లో మక్క జొన్న కంకులు కాలిబూడిదైన ఘటన వరంగల్ మొగిలి చెర్లలో ఆదివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన 20 మంది రైతులు తమ చేన్లలో పండించిన మక్కలు, మక్కజొన్న కంకు లను మొగిలిచెర్ల-గీసుగొండ రోడ్డుపై ఆరబోసుకున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు మక్కజొన్న చొప్పుకు నిప్పు పెట్టడంతో గాలికి నిప్పురవ్వలు వచ్చి కంకులు, మక్కలకు అంటుకున్నాయి.