CTR: పెనుమూరు మండలం మాజీ MPTC అరుణకుమారి తమ పొలంలో దౌర్జన్యంగా రోడ్డు వేసి తమను వేధిస్తోందని సామిరెడ్డిపల్లికి చెందిన ఉష, సుజన వాపోయారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో వారు మాట్లాడుతూ.. జీడీనెల్లూరు MLA థామస్ పేరు వాడుకుని ఆయనకు చెడ్డ పేరు తెచ్చేలా అరుణకుమారి అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. రికార్డుల ప్రకారం ఆమె ఆక్రమించుకున్న భూములు రోడ్డు మార్గానివేనన్నారు.