జగిత్యాల జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నవంబర్ 27 వరకు 48 సర్పంచ్ స్థానాలకు, 33 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్ ఈ వివరాలను వెల్లడించారు. భీమారం, కథలాపూర్, మల్లాపూర్, కోరుట్ల, మెట్‌పెల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లో నామినేషన్లు స్వీకరించారు.