SRCL: నూతనంగా నిర్మించ తలపెట్టిన కోర్టు భవనాల సముదాయం జిల్లా కేంద్రానికి మరో ఆకర్షణగా నిలవనుంది. మరో 50 సంవత్సరాల అవసరాలు తీర్చేలా అత్యాధునిక వసతులతో నిర్మించ తలపెట్టిన భవన నిర్మాణానికి శనివారం ఉదయం శంకుస్థాపన జరగనుంది. పాత కోర్టు స్థానంలోనే సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో రూ. 81.6 లక్షల వ్యయంతో రూపుదిద్దుకోనున్న భవనంలో 12 రకాల న్యాయస్థానాలు ఏర్పాటు చేయానున్నారు.