NZB: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2 ఏళ్ల కాలపరిమితికి సంబంధించి DMLT, డిప్లొమా ఇన్ డయాలసిస్ కోర్సుల కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.కృష్ణ మోహన్ సూచించారు. ఈనెల 8 నుంచి 28 వరకు కళాశాలలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.