MBNR: దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటకు కుడి, ఎడమ కాలువల ద్వారా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆదివారం సాగునీటిని విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద ఆయకట్టు రైతులకు ఈ యాసంగి సీజన్లో ఐదు విడతలుగా సాగునీటి విడుదల చేస్తున్నామని, తొలి విడతగా నేడు నీటి విడుదల చేశామని తెలిపారు.