ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో నయా దందా వెలుగుచూసింది. మరణించిన వారి దుప్పట్లను, పారేసిన దుప్పట్లను సేకరించి.. వాటిని కొత్త పరుపులుగా తయారు చేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. ఆ దుప్పట్లను మార్కెట్లకు తీసుకెళ్లి తక్కువ ధరలు విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.