KMM: ఈనెల 18న జిల్లాలో నిర్వహించనున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలని కోరుతూ ఎదులాపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్ధినేని కర్ణకుమార్ మాట్లాడుతూ.. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ మహాసభకు ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.