»Bjp Leader Bandi Sanjay And Mlc Koushik Reddy Carried The Brs Leader Mahender Reddy Cast
BRS నేత పాడే మోసిన బండి సంజయ్
రాజకీయాల కంటే అనుబంధాలే మఖ్యమని మరోసారి బీజేపీ ఎంపీ బండి సంజయ్(bandi Sanjay) చాటుకున్నారు. ఇటివల గుండెపోటుతో మృతి చెందిన నందగిరి మహేందర్‌రెడ్డి పాడేను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌషిక్ తో కలిసి మోశారు. అయితే మహేందర్ రెడ్డి గతంలో ఏబీవీపీ కార్యకర్తగా, బీజేపీ నేతగా ఉన్న క్రమంలో తనకు అనుబంధమున్నట్లు సంజయ్ పేర్కొన్నారు. ఏది ఏమైనా మహేందర్‌రెడ్డి పార్టీ మారినా కూడా సంజయ్ అతని పట్ల చూపిన అభిమానాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
హుజూరాబాద్‌లో బీఆర్ఎస్(BRS) నాయకుడు నందగిరి మహేందర్‌రెడ్డి(39)(mahender reddy) అంత్యక్రియల్లో కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్(bandi Sanjay), ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి(koushik reddy)తో కలిసి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత మహేందర్ రెడ్డి పాడేను సంజయ్, కౌశిక్ రెడ్డిలు కలిసి మోసుకెళ్లారు. మహేందర్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం బండి సంజయ్, కౌశిక్‌రెడ్డి పాటలు పాడారు. ఈ కష్ట సమయంలో భగవంతుడు అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతితో ఆశీర్వదించాలని కోరారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత మహేందర్ రెడ్డి గురువారం (జూలై 6న) గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహం వద్ద ‘డాడీ.. లే.. డాడీ’ అంటూ కొడుకు రోదనలు పలువురిని కలచివేశాయి. ఏడుస్తున్న అబ్బాయిని చూసి అక్కడున్న వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. నందగిరి మహేందర్ రెడ్డి కుటుంబం సైదాపూర్ మండలం రాయికల్ నుంచి వచ్చి చాలా కాలంగా హుజూరాబాద్‌లో నివాసం ఉంటోంది. గతంలో మహేందర్ రెడ్డి హుజూరాబాద్ పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అతను చనిపోయే వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు.