తెలంగాణ(Telangana) లో ఎండలు మండిపోతున్నాయ్. రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత (Sun intensity) మరింత పెరిగింది. సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రత (temperature) గురువారం నమోదైంది. రాష్ట్రంలో సూర్యడి దెబ్బకు అందరు బయట తిరగడమే మానేశారు. తెలంగాణవ్యాప్తంగా 40 డిగ్రీల సెల్సియస్పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణ(Telangana) లో ఎండలు మండిపోతున్నాయ్. రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత (Sun intensity) మరింత పెరిగింది. సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రత (temperature) గురువారం నమోదైంది. రాష్ట్రంలో సూర్యడి దెబ్బకు అందరు బయట తిరగడమే మానేశారు. తెలంగాణవ్యాప్తంగా 40 డిగ్రీల సెల్సియస్పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే ఆదిలాబాద్(Adilabad) జిల్లా చాప్రాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుల్లో(Julurupad) అత్యధికంగా 43.8 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ (Department of Meteorology) తెలిపింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు గురై ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, నిర్మల్ జిల్లా(Nirmal District)లో ఒక ఉపాధి కూలీ ఉన్నట్టు తెలిపారు. ఎండ దెబ్బలు(sunstrokes) పనులను కూడా వాయిదా వేసుకోవాలసి వస్తుంది. మరో నెల రోజుల పాటు ఇలాగే ఉంటుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఆదేశాలను జారీ చేసింది.