BDK: చర్ల మండలంలోని కలివేరు బట్టిగూడెం గ్రామంలో ఇర్ప నాగేష్, లక్ష్మీ దంపతుల ఇల్లు బుధవారం కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధం అయిందని స్థానికులు వెల్లడించారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇంట్లోని ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఇతర గుర్తింపు కార్డులు, గృహ సామగ్రి, దుస్తులు, బీరువా, కొంత బంగారం, వెండి పూర్తిగా కాలిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.