BDK: తెలంగాణ రాష్ట్రంలోనే పాల్వంచ కేశవాపురం, జగన్నాధపురం ఉమ్మడి గ్రామ దేవతగా ప్రసిద్ధి చెందిన పెద్దమ్మ తల్లి దేవస్థానంగా పేరు పొందింది. రానున్న దసరా పండగ సందర్భంగా చాలా ప్రత్యేకతలతో ఈ జాతర ఇక్కడ జరుగుతుంది. జాతరను పురస్కరించుకొని స్థానిక పెద్దమ్మ తల్లి గుడి కమిటీ సభ్యులందరు కలిసి ఉత్సవాలకు బుధవారం భూమి పూజ చేశారు.