BDK: రైతులు దళారీల బారిన పడకుండా సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధి శివారు గ్రామమైన పేటచెరువు గ్రామంలో సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ ప్రారంభించారు.