NRML: జిల్లాకు లభించిన ‘జల సంచాయ్–జనభాగిదారి’ అవార్డు అధికారుల సమిష్టి కృషికి నిదర్శనమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన అభినందన సభలో ఆమె మాట్లాడుతూ.. జల సంరక్షణలో అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది, ప్రజల భాగస్వామ్యమే ఈ విజయానికి కారణమన్నారు. అభినందన సభలో అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.