»Bandi Sanjay Makes Sensational Comments On Preethi Issue
bandi on preethi:లవ్ జిహాదే.. బండి సంజయ్ సంచలనం, రిమాండ్‌కు సైఫ్
bandi on preethi:మెడికో ప్రీతి (preethi) సూసైడ్ అటెంప్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఆత్మహత్యాయత్నం చేయడానికి కారణం లవ్ జిహదే అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (bandi sanjay). ఇది ర్యాగింగ్ మాత్రం కాదని చెప్పారు. వంద శాతం లవ్ జిహాద్ (love jihad) అని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసు నిర్వీర్యం చేస్తున్నారని బండి సంజయ్ (bandi sanjay) ఆరోపించారు.
bandi sanjay makes sensational comments on preethi issue
bandi on preethi:మెడికో ప్రీతి (preethi) సూసైడ్ అటెంప్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఆత్మహత్యాయత్నం చేయడానికి కారణం లవ్ జిహదే అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (bandi sanjay). ఇది ర్యాగింగ్ మాత్రం కాదని చెప్పారు. వంద శాతం లవ్ జిహాద్ (love jihad) అని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసు నిర్వీర్యం చేస్తున్నారని బండి సంజయ్ (bandi sanjay) ఆరోపించారు. ఆరోపణలు ఎదుర్కొంటోన్న సైఫ్‌ను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అందుకే అతనిపై సాధారణ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. హిందూ అమ్మాయిలను (hindu girls) ట్రాప్ చేస్తున్నారని బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీనిని పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు ప్రీతి (preethi) కండీషన్ సీరియస్‌గానే ఉంది. ఆమె నిమ్స్ ఆస్పత్రిలో (nims) వెంటిలేటర్‌పై ఉన్న సంగతి తెలిసిందే. ప్రీతి పేరంట్స్‌ను పొలిటిషీయన్స్ పరామర్శించి.. ధైర్యం చెబుతున్నారు. తన కూతురు బతికితే చాలు అని తండ్రి (father) అనడం ప్రతీ ఒక్కరినీ కలచివేసింది. భిక్షం ఎత్తుకుని అయినా సరే పెంచుకుంటా అని తెలిపారు.
ప్రీతి తల్లిదండ్రులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (errabelli dayakar rao) పరామర్శించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మెరుగైన వైద్యం అందజేయాలని వైద్యులకు ఆదేశాలు జారీచేశారు. ప్రీతిని (preethi) వేధించిన సీనియర్ రెసిడెంట్ సైఫ్‌ను (saif) పోలీసులు అరెస్ట్ చేశారు. మేజిస్ట్రెట్ ముందు హాజరుపరచగా 14 రోజుల (14 days) రిమాండ్ (remand) విధించారని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ (ranganath) తెలిపారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశామని.. దాంతోపాటు ర్యాగింగ్ కూడా కలిపామని చెప్పారు. సైఫ్ కావాలనే ప్రీతిని టార్గెట్ చేశాడని వివరించారు.
చదవండి:ys sharmila:పెద్ద దొరను సీఎం ఎందుకు చేయాలో చెప్పు.. కేటీఆర్‌కు షర్మిల ప్రశ్న
సైఫ్ తరచూ ప్రీతిని (preethi) అవమానించడం, చులకన చేసి మాట్లాడటం వల్లే రెండ్రోజుల క్రితం ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో నిమ్స్‌లో (nims) వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
కేఎంసీలో అనస్థీషియా విభాగంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రీతిని సీనియర్ మహ్మద్ సైఫ్ పదే పదే కేస్ షీట్ విషయంలో నీకు బుర్రలేదంటూ అవమానించడం, వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్‌లు పెట్టి అవమానించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. సెన్సిటివ్ అయిన ప్రీతి.. సైఫ్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్టు వాట్సాప్ మెసేజ్ తన స్నేహితులకు పెట్టిందని వరంగల్ సీపీ తెలిపారు.
మరోవైపు ప్రీతి సూసైడ్ అటెంప్ట్ చేసేందుకు కారణమైన సైఫ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. హైదరాబాద్ కోఠిలో గల వైద్య విద్య డైరెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. కాలేజీ మేనెజ్ మెంట్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.