Naresh released : బైరి నరేశ్ కి బెయిల్.. జైలు నుంచి విడుదల
దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ కి బెయిల్ మంజూరైంది. షరుతులతో కూడిన బెయిల్ (Bail )మంజూరు చేస్తున్నట్లు కొడంగల్ కోర్టు తెలిపింది. దీంతో బైరి నరేశ్ (Bairi Naresh) చర్లపల్లి జైలు నుండి విడుదలయ్యాడు.
దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్ కి బెయిల్ మంజూరైంది. షరుతులతో కూడిన బెయిల్ (Bail )మంజూరు చేస్తున్నట్లు కొడంగల్ కోర్టు తెలిపింది. దీంతో బైరి నరేశ్ (Bairi Naresh) చర్లపల్లి జైలు నుండి విడుదలయ్యాడు. దాదాపు 45 రోజుల పాటు అతడు జైల్లో ఉన్నాడు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా బైరి నరేశ్ వ్యాఖ్యలు చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.అనంతరం అతడికి కోర్టులో ప్రవేశపెట్టారు. అతడిని మొదట పరిగి (PARIGI) జైలులో ఉంచారు. అయితే, ఆ తర్వాత అతడి భద్రత కోసం అక్కడి నుంచి చర్లపల్లి (Charlapally)జైలుకు తరలించారు.
కొన్ని వారాల క్రితం బైరి నరేశ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందులో అయ్యప్ప స్వామిపై అతడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అతడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో(Video) సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది. అతడిపై అయ్యప్ప (Ayyappa)మాలధారులు దాడికి యత్నించినట్లు ప్రచారం జరిగింది.బైరి నరేశ్ ను అరెస్టు చేసిన తర్వాత పోలీసులు జైలుకు తరలించారు. జైలు బయట దాడి చేసే అవకాశం ఉండడంతో అప్పట్లో బైరి నరేశ్ జైలు లోపలికి భయంతో పరుగులు తీసిన వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఆ సమయంలో అతడి కుటుంబ సభ్యులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బైరి నరేశ్ పై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. అతడు గతంలోనూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని తెలిపారు.