SRD: పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని జిన్నారం జంగంపేట్ గ్రామంలో 1,376 సర్వే నంబర్లు గల 180 ఎకరాలను భవిష్యత్తు అవసరాలకు గత ప్రభుత్వం తీసుకున్న విషయం విధితమే. రైతులకు నష్టపరిహారంగా 600 గజాల HMDA ప్లాట్లను ఇచ్చి రైతులను ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం రెవిన్యూ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు.