ADB: తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతాల్లో 85, పట్టణ ప్రాంతాల్లో 25 విజయ పాల విక్రయ కేంద్రాలు మహిళా సంఘాల ద్వారా ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కేంద్రాలకు విజయ సఖి పేరుతోనడుపుతున్నామన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయ సఖి నమూనా ఫ్రిడ్జ్లను ఆయన ఆవిష్కరించారు.