మేడ్చల్ జిల్లాకు చెందిన నల్ల రామకృష్ణా రెడ్డి, రాణి కుమార్తె కీర్తన రెడ్డి ముంబై ఇండియన్స్ ఉమెన్స్ క్రికెట్ టీమ్‌లో చోటు దక్కించుకున్నారు. సాధారణ కుటుంబంలో జన్మించిన కీర్తన WPL- 2026కు సెలక్ట్ అవ్వడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో TG స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన రెడ్డి, గ్రామస్థులు కీర్తన రెడ్డికి అభినందనలు తెలిపారు.