RR: షాద్నగర్ నియోజకవర్గం చౌదరిగూడ మండల కేంద్రంలో ఇళ్లపై విద్యుత్ లైన్లు వేలాడుతుండటంతో ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున వైరు తగిలితే విద్యుత్ షాక్కు గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని కోరుతున్నారు.