WNP: అమరచింత మండల కేంద్రంలోని స్థానిక విజేత మోడల్ స్కూల్ విద్యార్థిని నిక్షిత ఇటీవల రాష్ట్రస్థాయిలో జరిగిన జూనియర్ కబడ్డీ మీట్లో చక్కటి ప్రతిభ కనబరిచి తృతీయ స్థానంలో నిలిచింది. శనివారం వనపర్తి జిల్లా కబడ్డీ సంఘం సెక్రటరీ రాము, అడిషనల్ సెక్రటరీ కురుమూర్తి క్రీడాకారిణి నిక్షితను సత్కరించి అభినందించారు.