VKB: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు మొదలుపెట్టింది. కొడంగల్ గోదాం నుంచి బొంరాస్పేట మండల పరిధిలోని అన్ని క్లస్టర్లకు 9,285 చీరలు రావడం జరిగిందని అధికారులు తెలిపారు. ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాంలో భాగంగా వచ్చేనెల 9 వరకు గ్రామాల్లో చీరలు పంపిణీ పూర్తికావాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండల పరిధిలో పంపిణీ తేదీలను త్వరలో విడుదల చేయనున్నారు.