NGKL: కొల్లాపూర్ మండలం సోమశిల కృష్ణానదిలో ఓ యువకుడు గల్లంతైన ఘటన వెలుగుచూసింది. HYDకు చెందిన అశోక్(35) నలుగురు స్నేహితులతోకలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు నదితీరానికి వచ్చారు. ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడిన అశోక్ కనిపించకుండాపోయినట్లు స్నేహితులు తెలిపారు. అశోక్ ఆచూకీకోసం స్థానికులతో కలిసి స్నేహితులు విస్తృతంగా గాలింపుచర్యలు చేపట్టారు.