MBNR: మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, వారి జీవన స్థితిగతులను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని శుక్రవారం ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కొత్త చెరువు వద్ద జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.