NLG: శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు 94,709 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం, ప్రాజెక్టు నీటి మట్టం 572.10 అడుగుల వద్ద ఉన్నది. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 261.8411 టీఎంసీలుగా ఉంది. జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.